ఎన్టీఆర్ తో బాలయ్య కలుస్తాడా ?

Monday, October 1st, 2018, 09:39:58 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలతో పాటు నందమూరి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ వేడుక రేపు హైద్రాబాద్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అథితిగా నందమూరి బాలయ్య వస్తాడని తెగ ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో నందమూరి అభిమానులు కూడా అవుననే అంటున్నారు. గత కొంత కాలంగా బాబాయ్ – అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరిని కలిపి చూడాలన్నది ఫాన్స్ కోరిక. కానీ ఆ కోరిక నెరవేరేలా లేదనుకున్నారు. అయితే ఇటీవలే హరికృష్ణ మృతి తరువాత జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య కలిసి మాట్లాడుకున్న వీడియొ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాంతో మళ్ళీ ఎన్టీఆర్ తో బాలయ్య దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. బాబాయ్ – అబ్బాయ్ మధ్య సయోధ్య కురిందని, అందుకే అరవింద సమేత వేడుకకు వస్తున్నాడని సమాచారం. అయితే వీరి కలయికకు కీ అయింది ఎవరో కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎలాగూ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి .. ఫ్యామిలీ లో విభేదాలు సరికాదని అనుకున్నారో కానీ మొత్తానికి సయోధ్య కుదిరే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరో వైపు అసలు బాలయ్య ఈ వేడుకకు రావడం లేదంటూ ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఇందులో నిజానిజాలేమిటన్నది చూడాలి.