షాక్ .. ఒకే వేదికపైకి బాబాయ్ .. అబ్బాయ్ ?

Sunday, October 21st, 2018, 12:41:22 AM IST

మొత్తానికి నందమూరి అభిమానులు ఎదురు చుస్తే ఆసక్తికర సన్నివేశం రేపు ఆదివారం సాయంత్రం ఆవిష్కృతం కానుంది. నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదికపై సందడి చేయనున్నారు. రేపు ఆదివారం సాయంత్రం హైద్రాబాద్ లోని శిల్పకళా వేదికలో ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సంచలన విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ సంబరాలను నందమూరి అభిమానులమధ్య గ్రాండ్ గా చేయనున్నారు. ఈ వేడుకకు బాలయ్య ముఖ్య అతిధిగా పాల్గొంటాడని నిర్మాతలు కన్ఫర్మ్ చేయడంతో .. నందమూరి అభిమానుల మధ్య పండగ వాతావరణం నెలకొంది. ఎన్నాళ్ళుగానో వేచిన ఉదయం అన్న తరహాలో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవలే హరికృష్ణ మరణంతో బాలయ్య, ఎన్టీఆర్ లు దగ్గరయ్యారని వీరిద్దరూ కలుస్తారని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ సినిమా సక్సెస్ మీట్ కు బాలయ్య రావడంతో వీరిద్దరూ కలిసిపోయారని వార్తలకు బలం చేకూరింది. సో ఈ వ్యవహారంతో అటు రాజకీయ, ఇటు సినీ సమీకరణాలు మారిపోతాయి !!

  •  
  •  
  •  
  •  

Comments