సీఎం జగన్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ..!

Thursday, May 28th, 2020, 11:02:33 PM IST

ఏపీ వైసీపీ సర్కార్‌పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ మహానాడులో రెండో రోజు పాల్గొన్న బాలకృష్ణ జగన్ ప్రభుత్వం ఐదేళ్లు పాలన కొనసాగించలేదని త్వరలోనే కూలిపోతుందన్నారు.

అయితే టీడీపీ ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తుందని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి అని అన్నారు. అయితే ఎన్టీఆర్ వారసులం మేం కాదని, టీడీపీ కార్యకర్తలే ఎన్టీఆర్‌కు నిజమైన వారసులు అని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. అయితే తన చివరి ఊపిరి ఉన్నంత వరకు టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.