బాలయ్య – పూరీ సినిమా గురించి రేపు చెప్తారు ?

Thursday, February 23rd, 2017, 05:01:54 PM IST


టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త కహానీ వినిపిస్తోంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – నందమూరి బాలయ్య కాంబినేషన్ లో సినిమా రేపు ప్రకటన వస్తుంది అంటున్నారు. మహేష్ తో జనగణమన అంటూ ప్రకటించిన పూరీ జగన్నాథ్ వెంకటేష్ తో చేద్దాం అనుకున్నాడు కానీ అది వర్క్ అవ్వక స్టోరీ ని కాస్త అటూ ఇటూ చేసి బాలయ్య కి వినిపించాడు. కాని నిజానికి పూరి జగన్ ఎప్పుడో బాలయ్య కోసం ఒక కథను రెడీ చేసి పెట్టాడట. ఇప్పుడు ఆ కథను స్టార్టింగ్ టైటిల్ నుండి ఎండింగ్ టైటిల్ వరకు పూర్తిగా బాలయ్యకు వినిపించడంతో ఆయన వెంటనే సినిమాను ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనే విషయంపై ఇంకా పూరి ఒక క్లారిటీకి రాలేదు కాని.. తన పూరి కనెక్ట్స్ సంస్థ ద్వారానే ఓ ఇద్దరు కొత్త మోడల్స్ ను హీరోయిన్లుగా పరిచయం చేస్తాడని ఓ టాక్.