వరుస సినిమాలతో బాలయ్య బిజీ.. బిజీ..?

Tuesday, May 22nd, 2018, 09:12:08 AM IST

నందమూరి బాలకృష్ణ ఎంత యాక్టీవ్ అన్నది అందరికి తెలుసు. వరుసగా సినిమాలు చేస్తూనే సినిమా వేడుకల్లో అయన చేసే సందడి అంతా ఇంతా కాదు. నిజంగా అయన సూపర్ స్పీడ్ ని చూసి నేటి యువతరం ఎంతైనా నేర్చుకోవాలి. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారనున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్ పెట్టేసాడు. మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కే బయోపిక్ ఈ మద్యే మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఆ సినిమాకు బ్రేక్ లు పడ్డాయి. దాంతో వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. జూన్ లో ఈ సినిమా మొదలు కానుంది.దాంతో పాటు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా బాలయ్యతో నెక్స్ట్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను, బాలయ్య కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలిసింది. బాలయ్య కెరీర్ బెస్ట్ చిత్రాలను అందించిన బోయపాటి ఇప్పడు హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు. వినాయక్ సినిమా తరువాత బోయపాటి శ్రీను సినిమా పట్టాలు ఎక్కనుంది. సో .. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments