షాక్ .. సీనియర్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య ?

Thursday, September 28th, 2017, 02:38:21 PM IST

నందమూరి బాలకృష్ణ వేగాన్ని అందుకోవడం ఇప్పటి యువ హీరోలకే కష్టాంగా మారింది. వంద సినిమాలు పూర్తీ చేసిన బాలయ్య .. వేగం పెంచాడు .. వరుసగా 101 గా పైసా వసూల్ విడుదలైంది. ప్రస్తుతం 102 గా తమిళ సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా తరువాత బాలయ్య ఇద్దరు ముగ్గురు దర్శకులతో కథ చర్చలు జరుపుతున్నాడట. ఒకటి అనిల్ రావిపూడి .. రెండోది ఓ సీనియర్ దర్శకుడు ? మరో వైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి .. అయితే దానికి ఇంకాస్త టైం పట్టేలా ఉందట !! ఈలోగా సీనియర్ దర్శకుడికి ఓకే చెప్పాడట ? ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా ఎస్ వి కృష్ణా రెడ్డి !! అవును మీరు వింటున్నది నిజమే .. తాజాగా బాలయ్య తో కృష్ణా రెడ్డి చర్చలు జరిపాడని .. ఆ మధ్య యమలీల 2 సినిమా తీసిన కృష్ణా రెడ్డి ..ఆ తరువాత మారె సినిమా చేయలేదు. గతంలో బాలయ్యతో టాప్ హీరో సినిమాను తెరకెక్కించాడు కృష్ణా రెడ్డి, ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా బాలయ్యకు బాగా నచ్చిందట. అందుకే మరో సినిమా చేద్దామని అప్పట్లోనే కృష్ణారెడ్డి కి మాట ఇచ్చాడని .. ఇప్పుడు ఆ సమయం రావడంతో కృష్ణారెడ్డి సన్నాహాలు మొదలు పెట్టాడట. ప్రస్తుతం ఫామ్ లో లేని కృష్ణా రెడ్డి ఈ సినిమాతో మళ్ళీ తన సత్తా చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాడట !! మరి ఈ విషయం నిజమా కదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Comments