బాలయ్య 104వ సినిమా కన్ఫర్మ్ అయినట్టే ?

Thursday, March 29th, 2018, 10:55:51 AM IST

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో అన్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న బాలకృష్ణ. ఎన్టీఆర్ పేరుతొ తెరకెక్కే ఈ సినిమా ఈ రోజు హైద్రాబాద్ లో మొదలైంది. బాలయ్య 103వ చిత్రంగా ఎన్టీఆర్ రూపొందుతుండగా అయన 104 వ సినిమా కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడంలో ఘన విజయం సాధించిన మఫ్టీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తారట. ఈ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తారని టాక్. ఇప్పటికే నిర్మాత సి కళ్యాణ్ వినాయక్ ని ఒప్పించినట్టు సమాచారం. ఇదివరకే బాలయ్యతో వినాయక్ తీసిన చెన్నకేశవరెడ్డి సినిమా భారీ పరాజయం పాలవడంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తరువాత బాలయ్యతో వినాయక్ చేసే సినిమా ఇదే కావడం విశేషం. బాలయ్యతో ఇటీవలే జై సింహ చిత్రాన్ని తీసిన సి కళ్యాణ్ తో మరో సినిమా చేస్తానని బాలయ్య మాట ఇచ్చారట, అందుకే సి కళ్యాణ్ ఆ కన్నడ సినిమా హక్కులు తీసుకుని వినాయక్ తో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ చివరలో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.