మహానటి హిట్ తో టెన్షన్ లో పడ్డ బాలయ్య ?

Friday, May 11th, 2018, 06:37:59 PM IST

దివంగత మహానటి సావిత్రి జీవిత గాథగా తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం మహానటి. విడుదలయిన తొలి రోజునుండి ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా లీడ్ రోల్ లో నటించిన కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఆవిడను చూస్తుంటే అచ్చం సావిత్రి గారిని చూస్తున్నట్లే ఉందని అంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర విజయంతో టాలీవుడ్ కి మరొక మంచి హిట్ దక్కినప్పటికీ, ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ ఆలోచనలో పడ్డారని సమాచారం. ఎందుకంటె ఈ బయోపిక్ నిజంగా ఒక పెద్ద బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసి, అసలు బయోపిక్ అంటే ఇలానే ఉండాలి అనే ఒక ముద్రను ప్రేక్షకుల గుండెల్లో వేసింది.

ఇక రాబోవు ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రేక్షకులు ఇంకెన్నో అంతకుమించిన అంచనాలు పెట్టుకుంటారు అనేది నిజం. తెలుగువారి ఆరాధ్య దైవం అయిన రామారావు గారి జీవితం మాత్రమే చిత్రీకరిస్తే సరిపోదు, దానిని తెరమీద రక్తికట్టించే నటీనటవర్గం ఉండాలి. అంతే కాదు ముఖ్యంగా కమర్షియల్ అంశాలను లేకపోయినా తెరమీద ఆయన కథను ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా తెరకెక్కించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది నిజంగా ఒక పెద్ద సవాలని తెలుస్తోంది. అందునా చిత్రం ప్రారంభం అయ్యాక దర్శకుడు తేజ తప్పుకోవడంవల్ల బాలకృష్ణ కూడా తానే స్వయంగా దర్శకత్వం వహించాలా లేక మరే ఇతర దర్శకుడికి అయినా అప్పగించాలా అనే విషయం ఆయనను సందిగ్ధంలో పడేశాయి అనేది ఫిలిం నగర్ లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజమెంత ఉందొ తెలియదు కానీ, మహానటి తర్వాత రానున్న పలువురు ప్రముఖుల బయోపిక్ లపై అంచనాలు మాత్రం పెరిగాయి అనేది ఒప్పుకోవాల్సిన విషయం…….

  •  
  •  
  •  
  •  

Comments