బాలకృష్ణ మల్టీ స్టారర్ .. చిరు ? వెంకీ ? నాగార్జున ? ఎవరితో ?

Friday, January 20th, 2017, 02:57:47 PM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కాదూ ? దానికి ఆయన ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న. మల్టీ స్టారర్ లు తీయడానికి తనకి అభ్యంతరం లేదు అనీ పైగా మల్టీ స్టారర్ కోసం ఒక కథ కూడా వెతుకుతున్నాం అని బాలయ్య చెప్పడం గమనార్హం. తాను ఒక హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయాలని అనుకుంటున్నానని.. ఆ దిశగా స్క్రిప్టు కూడా రెడీ అవుతోందని.. వచ్చే ఏడాది ఈ సినిమా చేయాలనుకుంటున్నానని.. ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయ్యాక వివరాలు వెల్లడిస్తానని బాలయ్య తెలిపాడు. సీనియర్ హీరోలలో బాలయ్య – చిరు తప్ప మిగిలిన నాగ్ – వెంకటెష్ లు వేరే హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేసినవారే.ఇప్పుడే రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మల్టీస్టారర్ చేయడానికి సమయం పట్టొచ్చేమో. బాలయ్య లాంటి హీరో మల్టీస్టారర్ చేస్తే ఆ సినిమాకు మామూలు హైప్ రాదు. మరి ఆయన మైండ్లో ఉన్న ఆ హీరో ఎవరో చూడాలి.