తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ..!

Saturday, September 5th, 2020, 11:06:43 PM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌కి సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫేస్‌బుక్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ట సంతోషం వ్యక్తం చేస్తూ, ఆ పుస్తకంలో తన తండ్రి పాఠాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ, అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.