బాలకృష్ణ అల్లుడు భరత్ : నా ఓటమికి అదే కారణం..గుణపాఠం నేర్చుకున్న

Friday, June 14th, 2019, 05:44:43 PM IST

తెలుగుదేశం పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీ సీటు కోసం పోరాటం చేసి, చివరికి మామ మద్దతు,’మహాలక్ష్మి’ మద్దతుతో ఉక్కు సిటీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేశాడు భరత్. కానీ వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి MVV సత్యనారాయణ చేతిలో నాలుగువేల ఓట్లు పైగా తేడాతో ఓడిపోవటం జరిగింది. 29 ఏళ్లకే లోక్ సభలో అడుగుపెట్టాలని కలలు కన్న భరత్ ఆశలు నెరవేరలేదు. ఇక తాజాగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సమీక్షలో పాల్గొన్న భరత్ మాట్లాడుతూ, ఎన్నికలో ఓడిపోవటం అనేది కొంచం బాధకలిగించే విషయమే అని చెప్పాలి. మా శక్తి మేరకు మేము కష్టపడి పనిచేశాం.

దాదాపు నాలుగు లక్షల పైగా ఓట్లు సాధించాను అంటే ప్రజల నన్ను గుర్తుపట్టి, నాపై నమ్మకం ఉంచి ఓట్లు వేశారు. నేను ఓడిపోవటానికి నాలుగు వేలు ఓట్లే కారణం. అంత దగ్గర దాక నన్ను తీసుకోని వచ్చిన విశాఖ ప్రజలకి నేనెప్పుడు రుణపడి ఉంటాను. మా ఏరియా లో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని తెలుసు, కానీ ఈ స్థాయిలో జరిగి JD గారికి రెండు లక్షల పైగా ఓట్లు వస్తాయని మాత్రం అనుకోలేదు. కారణాలు ఏమైనా కావచ్చు, విజయం దాక వచ్చి ఓడిపోయాము. ఇది మాకు ఒక గుణపాఠం, దీని నుంచినేను నేర్చుకొని ముందుకి పోతాను. నాకు ఇంకా చిన్న వయస్సే కాబట్టి నేర్చుకోవలసింది చాలా ఉంది..వాటిని నేర్చుకుంటూ రాజకీయ రంగంలో రాణించటానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు.