జగన్ దారితప్పితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు

Friday, June 14th, 2019, 09:07:42 PM IST

2019 ఎన్నికల్లో ఎవరు ఊహించలేని స్థాయిలో జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ స్థాయిలో జగన్ కి ప్రజా మద్దతు వచ్చిందంటే, అతని మీద ప్రజల ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్ధం చేసుకోవాలి, అసలే లోటు బడ్జెట్ రాష్ట్రము, ఇప్పటికే అప్పుల ఊబిలో కురుకొనిపోయింది. దాని నుండి బయటపడి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించటం అనేది “కత్తి మీద సాము” అనే చెప్పాలి. ఇలా అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు జగన్ చిక్కుతాడా..? అతనిని టార్గెట్ చేద్దామని ఎదురుచూస్తూ వుంది. ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా జగన్ అడుగులు వేయాలి. తాజాగా విజయవాడలో జరిగిన టీడీపీ పార్టీ మీటింగ్ కి విశాఖపట్నం ఎంపీ గా పోటీచేసి ఓడిపోయిన బాలయ్య అల్లుడు భరత్ వచ్చి మీడియాతో కొన్ని విషయాలు మాట్లాడాడు.

తన ఓటమికి క్రాస్ ఓటింగ్ ప్రధాన కారణమని,దీనితో జేడీ లక్ష్మి నారాయణ గారికి అన్ని ఓట్లు వచ్చాయని, నా ఓటమికి అది కూడా ఒక కారణమని, దాని నుండి గుణపాఠాలు నేర్చుకుంటామని చెప్పాడు. ఇక జగన్ విజయం గురించి మీడియా అడిగిన దానికి సమాధానం చెపుతూ,151 సీట్లు ఇచ్చి ఆయనకి ముఖ్యమంత్రి పదవిని ప్రజల ఇచ్చారు,. దానిని దృష్టిలో పెట్టుకొని అయన పాలన అనేది సాగాలి. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడే పోరాటం చేసేవాళ్ళం. పరిపాలన బాగుంటే అభినందిస్తాం. ఏమైనా వాళ్ళ ప్రభుత్వం దారితప్పితే మాత్రం చూస్తూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..ప్రజావేదికలమీద వాళ్ళ తప్పులను ఎట్టి చూపిస్తూ, ప్రజలకి మంచి జరిగేలా చూస్తూ అసలైన ప్రతిపక్షం పార్టీగా మా బాధ్యతలను నిర్వహిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు..