7 నెలల గ్యాప్ తీసుకుంటున్న బాలయ్య?

Wednesday, January 24th, 2018, 10:53:50 AM IST


యువరత్న నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో చాలావరకు సినిమాలు వేగంగానే పూర్తి చేస్తుంటారు.ఈ మధ్య కాలం లో ఆయన కెరీర్ మరింత ఊపు అందుకుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం పూర్తి అయిన వెంటనే పైసా వసూల్ చిత్రం ప్రారంభించి చకచకా పూర్తిచేశారు. ఆ చిత్రం ఆఖరిరోజు పూర్తి కాగానే మరుసటిరోజు జైసింహ షూటింగ్ ప్రారంభించారు బాలయ్య. దర్శకుడు ఎవరైనా, ఆ దర్శకుడికి ప్లాప్ లు ఎన్ని వున్నాయి, హిట్లు ఎన్ని ఇచ్చారు అనేవి ఆయన పెద్దగా దృష్టి పెట్టరని, తనకి కథ , కథలోని తన పాత్ర నచ్చితే చాలు వెనువెంటనే షూటింగ్ ప్రారంభించి తన పాత్ర చిత్రీకరణ చకచకా పూర్తిచేస్తుంటారు. అయితే వున్నట్లుండి ఆయన ప్రస్తుత కెరీర్లో దాదాపు 7 నెలలపాటు అనుకోని విధంగా విరామం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విషయం ఏంటంటే దర్శకుడు తేజ తో ఆయన చేస్తున్న ఎన్టీఆర్ బయో పిక్ ఏప్రిల్ లో ప్రారంభం అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి కొంత రీసెర్చ్ చేయవలసివుందని, దానికి ఇంకొంత సమయం అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. అలా చూస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్ లో షూటింగ్ ఆరంభిస్తారని సమాచారం అందుతోంది. దీన్ని బట్టి చూస్తే జనవరి నుండు ఆగష్టు చివరివరకు, అంటే ఈ 7 నెలలు విరామం రానుంది. ఈ గ్యాప్ లో బాలయ్య ఏమి చేస్తారు అనే దానిపై అందరికి ఆసక్తి నెలకొని వుంది. ఒకవైపు బోయపాటి శ్రీను, చరణ్ తో చిత్రం చేస్తున్నారు. మరొకవైపు పూరి జగన్నాధ్ ఆయన తనయుడితో చిత్రం చేస్తున్నారు. తన అభిమాన దర్శకులు బిజీగా ఉండడంతో బాలయ్య మరే దర్శకునితో అయినా చిత్రం ప్రకటిస్తారా లేక, రాజకీయాలపై కొంత దృష్టిపెడతారా అనేది తెలియాల్సివుంది. ఏదిఏమైనప్పటికీ 7 నెలల సమయం అనేది ఎక్కువే అని, ఎవరైనా దర్శకులు ఈ లోపు వచ్చి కథ చెప్పి ఒప్పిస్తే ఈ గ్యాప్ లో షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు…