బాలయ్య అదే సెంటిమెంట్ ఫాలో అయతే.. వందో చిత్రం ఆయనకే దక్కుతుందా..?

Monday, February 22nd, 2016, 10:47:59 AM IST


నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు 99 చిత్రాలు చేశాడు. ఇక, బాలకృష్ణకు బి, సి సెంటర్స్ లో మంచి పట్టున్నది. బాలయ్య అభిమానులు అక్కడే ఎక్కువగా ఉన్నారు. బాలకృష్ణ ఎక్కువ రోజులు ఆడిన చిత్రాలు కూడా బి, సి సెంటర్స్ లోనే ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక బాలకృష్ణకు మొదటి నుంచి ఒక సెంటిమెంట్ ఉన్నది. బి అనే అక్షరాన్ని బాలకృష్ణ ఎక్కువగా నమ్ముతున్నారు. ఆయనకు దానిమీద గురి ఎక్కువ. అందుకే ఎక్కువగా బి అనే పేరుతో మొదలయ్యే దర్శకులతో ఎక్కువ సినిమాలు చేశారు. హిట్ కూడా అందుకున్నారు. బాలకృష్ణ కెరీర్ లో భారీ హిట్స్ కూడా వారే ఇచ్చారు అనడంలో సందేహం లేదు.

గతంలో బాలకృష్ణ బి గోపాల్ తో చాలా చిత్రాలు చేశారు. అందులో లారిడ్రైవర్, రౌడి ఇన్స్పెక్టర్, సమాసింహ రెడ్డి, నరసింహ నాయుడు వంటి చిత్రాలు బాలకృష్ణ కెరీర్ లో మరిచిపోలేని చిత్రాలు. ఇక బాలకృష్ణ బాపుతో కూడా సినిమా చేశారు. అదే శ్రీరామరాజ్యం. ఇది కూడా మంచి హిట్ అయింది. ఇక ఆ తరువాత బాలకృష్ణ బోయపాటితో రెండు చిత్రాలు చేశారు. సింహా, లెజెండ్. ఈ రెండుకూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి బాలకృష్ణ 99 చిత్రాలు పూర్తిచేశారు. వందో సినిమాగురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంతవరకు ఎవర్ని కూడా ఫైనలైజ్ చేయలేదు. గతంలో లాగా బాలకృష్ణ బి సెంటిమెంట్ ను ఫాలో అయితే.. బోయపాటికి అవకాశం దక్కోచ్చని.. బోయపాటితో బాలకృష్ణ వందో సినిమా ఉంటె.. అది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది అనడంలో సందేహం లేదని బాలయ్య అభిమానులు చెప్తున్నారు.