బాలయ్య నెక్స్ట్ టార్గెట్.. ఆ రెండు పార్టీలేనా ?

Sunday, October 29th, 2017, 10:42:16 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జోరుగా జరుగుతుంది. తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జై సింహ అనే టైటిల్ ఫిక్స్ చేసింది యూనిట్. అయితే ఈ సినిమాతో తన పొలిటికల్ కెరీర్ కు ప్లస్ అయ్యేలా ప్లాన్ చేసినట్టు ఉన్నాడు బాలయ్య .. ఇప్పటికే అయన తన సినిమాల్లో డైలాగ్స్ తో అదరగొట్టాడు .. ఈ సినిమాలో కూడా రెండు పార్టీలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది ? ఎందుకంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇందులో బాలయ్య పోలీస్ అధికారిగా కనిపిస్తాడని తెలుస్తోంది ఎందుకంటే కోర మీసంతో పౌరుషంగా ఉన్న బాలయ్య రోడ్డుమీద ఒక పార్టీ వాళ్ళు ధర్నా చేస్తుంటే దాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఫొటోల్లో ఓ రాజకీయ పార్టీ వేసిన కండువాలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అని తెలిసిపోతుంది. దాంతో పాటు మరో ఫొటోలో వైసిపి రంగులు కూడా ఉన్నాయి. మొత్తానికి అటు కాంగ్రెస్, ఇటు వైసిపి లను బాలయ్య భలేగా టార్గెట్ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తారట !!

  •  
  •  
  •  
  •  

Comments