వారం గ్యాప్ లో బాల‌య్య రెండు ఓపెనింగులు

Thursday, May 24th, 2018, 12:34:23 PM IST

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్క‌నున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా ప‌నులు సాగుతుండ‌గానే బాల‌య్య వ‌రుస‌గా మ‌రో రెండు సినిమాల్లో న‌టించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. వి.వి.వినాయ‌క్, బోయ‌పాటితో వ‌రుసగా సినిమాలు ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

మే 28న ఎన్టీఆర్ పుట్టిన‌రోజున వి.వి.వినాయ‌క్ సినిమా ఓపెనింగ్ చేయ‌నున్నారు. అటుపై జూన్ 10న బాల‌య్య పుట్టిన‌రోజున బోయ‌పాటితో సినిమా ప్రారంభం కానుంది. శ‌తాదిక‌ చిత్రాల క‌థానాయ‌కుడిగా బాల‌య్య అంత‌కంత‌కు యువ‌హీరోల తీరుగా స్పీడ్ పెంచేస్తుండ‌డం వాడివేడిగా చ‌ర్చ‌కొచ్చింది. ఒకేసారి మూడు సినిమాలతో క్ష‌ణం తీరిక లేకుండా ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి. మ‌రోవైపు 2019 ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు సాగుతున్న వేళ ఇలా బాల‌య్య సినిమాలు లాంచ్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments