ఆ దర్శకుడితో బాలయ్య నెక్స్ట్ సినిమా ?

Monday, March 26th, 2018, 10:06:15 AM IST

ప్రస్తుతం జై సింహ తో మంచి విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కే ఈ సినిమా ఈ నెల 29న హైద్రాబాద్ లో గ్రాండ్ గా మొదలు కానుంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ 104 వ చిత్రాన్ని వినాయక్ దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడట. గతంలో బాలయ్య వినాయక్ దర్శకత్వంలో చేసిన చెన్నకేశవరెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయం అందుకుంది. ఆ తరువాత మళ్ళీ బాలయ్య ఎప్పుడు వినాయక్ తో సినిమా చేయలేదు. తాజాగా వినాయక్ దర్శకత్వంలో నటించేందుకు బాలయ్య ఓకే చెప్పాడట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తాడని, బాలయ్య – వినాయక్ ల కాంబినేషన్ ను సెట్ చేసింది కూడా నిర్మాత సి కల్యాణే.