చేతనైతే వలసలు ఆపండి!

Monday, October 13th, 2014, 06:35:47 PM IST

revanth-reddy
తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత రేవంత్ రెడ్డిపై తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం నాయకత్వం దక్కించుకునేందుకు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి అదే పనిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అలాగే తెలంగాణలో ఉనికిని కాపాడుకునేందుకే తెలుగుదేశం పార్టీ బస్సు యీత్రను చేస్తోందంటూ బాలరాజు ఎద్దేవా చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కెసిఆర్ చేస్తున్న కృషిని గుర్తించే టిటిడిపి నేతలు తెరాసలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఇక తెరాసలోకి వచ్చే తెలుగుదేశం నేతల వలసలను ఆపడం రేవంత్ రెడ్డికి చేతకాదని గువ్వల బాలరాజు తీవ్రంగా విమర్శించారు.