బాక్సు బద్దలే..బోయ మల్టీస్టారర్ కు బాలయ్య, మహేష్ గ్రీన్ సిగ్నల్..?

Sunday, December 3rd, 2017, 05:16:21 PM IST

బాలకృష్ణ, మహేష్ బాబులతో మల్టీస్టారర్ చిత్రం చేయడానికి మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి గతంలోనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ దర్శకుడు ప్రయత్నాలు ఫలితాల దిశగా అడుగులు పడుతున్నాయి. బోయపాటి చెప్పిన స్టోరీ లైన్ కు బాలయ్య తోపాటు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ న్యూస్. పూర్తి స్క్రిప్ట్ తో వస్తే మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దామని ఈ దర్శకుడికి ఇద్దరు హీరోలు చెప్పారట.

దీనితో బోయపాటి స్క్రిప్ట్ పనులని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బోయపాటి త్వరలో రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రం పూర్తైన తరువాత బోయపాటి చేయబోయే చిత్రం ఇదే అని అంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టి స్టారర్ చిత్రాల జోరు పెరుగుతోంది. కాగా మాస్ సినిమాలకు బోయపాటి పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో బాలయ్య, మహేష్ లని బోయపాటి ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ చిత్రం కనుక పట్టాలెక్కితే చరిత్ర సృష్టించడం ఖాయం అని అటు మహేష్ అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments