షాక్ .. బాలయ్య ఏకే 47 పడితే ?

Thursday, June 14th, 2018, 10:40:11 AM IST

నందమూరి అందగాడు బాలకృష్ణ హీరోగా నటించే 104 వ సినిమాకు రంగం సిద్ధం అయింది. పైసా వసూల్ తరువాత బాలయ్య హీరోగా నటిస్తున్న 103 వ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యూనిట్ లోకి దర్శకుడు క్రిష్ ఎంటర్ అవ్వడంతో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఇంకాస్త టైం పట్టేలా ఉండడంతో ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలనీ భావించిన బాలయ్య తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పడంతో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ రంగంలోకి దిగాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్ పూర్తీ కావొచ్చింది. ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని టాక్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తరువాత వీరిద్దరితో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ వర్కవుట్ కాలేదు .. ఇన్నాళ్లకు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమాను సెట్ చేసాడు. జులై లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తేనున్నారట.. దాంతో పాటు సినిమాకు టైటిల్ పెట్టె ఆలోచనలో కూడా పడ్డారు .. ఈ కథ ప్రకారం ఏకే 47 అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. మరి ఈ టైటిల్ పై బాలయ్య ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments