సంక్రాంతి సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న బాలయ్య ?

Tuesday, April 24th, 2018, 10:21:23 AM IST

​​

నందమూరి బాలకృష్ణ కు సెంటిమెంట్స్ కాస్త ఎక్కువే .. ఈ విషయాన్నీ పరిశ్రమలో ఎవరిని అడిగిన చెప్పేస్తారు. ఇక ఇటీవలే జై సింహ తో విజయం అందుకున్న బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత తన 104 వ చిత్రాన్ని అప్పుడే ఓకే చేసేసాడు. మాస్ దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించేశాడు. సో మొత్తానికి బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడన్నమాట.

  •  
  •  
  •  
  •  

Comments