బాలయ్య – బోయపాటిల సినిమాకు ముహూర్తం కుదిరింది ?

Friday, May 25th, 2018, 02:08:29 PM IST

బాలయ్య కెరీర్ లో నిలిచి పోయే చిత్రాలుగా మలచిన దర్శకుడు బోయపాటి శ్రీను తో మరో సినిమాకు బాలయ్య ఓకే చెప్పాడు. తన కెరీర్ బెస్ట్ చిత్రాలుగా నిలిచినా సింహ , లెజెండ్ లతో ఈ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అయింది. నిజానికి బాలకృష్ణ 100 వ సినిమానే చేయాలనీ ప్లాన్ చేసాడు బోయపాటి కానీ వేరే సినిమాల కమిట్మెంట్స్ తో బాలయ్య బిజీగా ఉండడంతో కుదరలేదు. తాజాగా బాలకృష్ణ బోయపాటితో చేసే సినిమా ప్రకటనకు సమయం ఆసన్నం అయింది. జూన్ పది న బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాను అనౌన్చ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ రోజే ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటిస్తారని అంటున్నారు. మరి ఈ హ్యాట్రిక్ హిట్ కోసం బోయపాటి ఎలాంటి కథను సిద్ధం చేసాడో అన్న ఆసక్తి ఇప్పటికే నందమూరి అభిమానుల్లో కలుగుతోంది. మరో వైపు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు , దాంతో పాటు వినాయక్ తో కూడా ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments