బాలయ్య లిస్ట్ లోకి మరో కొత్త దర్శకుడు?

Tuesday, December 27th, 2016, 05:30:07 PM IST

balayya
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందో సినిమా ”గౌతమీపుత్ర శాతకర్ణి” ఆడియో విడుదలయింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య 101 వ సినిమా పై అప్పుడే ఆసక్తికర వార్తలు పుట్టుకొస్తున్నాయి? ఇప్పటికే బాలయ్య 101 వ సినిమాను కృష్ణవంశీ ”రైతు” కథతో తీస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ తరువాత ఆ న్యూస్ మరెక్కడా వినిపించలేదు.. ఈ లోగా మరో ఒకరు ఇద్దరు దర్శకులు లిస్ట్ లోకి వచ్చారు .. తాజాగా ఈ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సీనియర్ దర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్డి !! అప్పట్లో బాలయ్యతో ‘టాప్ హీరో’ సినిమాను తీసిన కృష్ణవంశీ చాలా కాలం తరువాత బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేసాడట. ఈ మద్యే బాలయ్య తో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి? ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో ఉంటుందని, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే .. అధికారిక వివరాలు వచ్చే వరకు ఆగాల్సిందే !!

  •  
  •  
  •  
  •  

Comments