బాలయ్య వినాయక్ సినిమా .. సాధ్యమేనా ?

Wednesday, February 15th, 2017, 12:19:44 PM IST


అల్లుడు శ్రీను – అఖిల్ లాంటి ప్లాప ల తరవాత కూడా తన ప్రతిష్టాత్మక 150 వ సినిమాని చిరంజీవి వినాయక్ చేతిలో పెడితే అందరూ ఆశ్చర్యంగా చూసారు. చిరు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ వాపోయారు. సరైన సబ్జెక్ట్ కి కత్తి లాంటి పవర్ ఫుల్ స్టోరీ కి వినాయక్ కరక్ట్ అంటూ చిరు స్వయంగా వినాయక్ ని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చిన తరుణం లో… ఖైదీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టార్ హీరోలు అందరూ కమిట్మెంట్ లతో ఉండడం తో వినాయక్ తరవాతి సినిమా ఏంటి అంటూ ఇంకా క్లారిటీ రాలేదు. సాయి ధరం తేజతో ఒక సినిమా అన్నారు కానీ దీనిపై ఎలాంటి అప్ డేట్ కానీ అనౌన్స్ మెంట్ కానీ రాలేదు. కానీ ఇప్పుడు వివి వినాయక్ మెగా క్యాంప్ నుంచి నందమూరి ఫ్యామిలీకి షిఫ్ట్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణను కలిసిన వినాయక్.. ఓ ప్రాజెక్టుపై దాదాపు ఒప్పించాడని అంటున్నారు. ప్రస్తుతం సీనియర్ రైటర్స్ కొందరు.. స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారట.