డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో బాలయ్య మరో సినిమా?

Saturday, April 14th, 2018, 05:54:35 PM IST

ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో చాలా వరకు ఏడాదికో సినిమా చేస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం వారి కంటే వేగంగా ఈ వయసులో కూడా చాలా స్పీడ్ గా సినిమా చేస్తున్నాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమా ఒకే చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కోసం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమాను మొదలు పెట్టె పనిలో పడ్డాడు. వివి వినాయక్ దర్శకత్వంలో త్వరలో ఒక సినిమాను స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారట. గతంలో వినాయక్ తో బాలయ్య చెన్నకేశవ రెడ్డి అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు. అయితే ఈ సారి ఎలాగైనా ఆయనతో ఒక మంచి సినిమా చేసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక వచ్చే నెల 12న సినిమాను లంచ్ చేసి ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ వినాయక్ ప్రాజెక్టును ఫినిష్ చేయాలనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.