62 గెటప్పుల్లో బాలయ్య .. ఇది ఫిక్స్ అయ్యా ?

Friday, February 9th, 2018, 01:02:59 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే తదుపరి చిత్రానికి సన్నాహాలు జోరందుకున్నాయి. మహా నటుడు అన్న నందమూరి తారకరామారావు బయోపిక్ గా తెరకెక్కే ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన బాలయ్య .. ఈ సినిమా తరువాతే మిగతా సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. ఎందుకంటే వచ్చే ఎన్నికల సమయానికి దాదాపు విడుదల ప్లాన్ చేయొచ్చని అయన ప్లాన్. అందుకే ప్రయత్నాలు ముమ్మరంగా చేసారు. ఈ సినిమాకోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ ని దింపుతున్నారు.

ఎన్టీఆర్ జీవితంలో జరిగిన పలు కీలక సన్నివేశాలు ఉంటాయని .. సామాన్య మానవుడి నుండి తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా మరీనా ఎన్టీఆర్ జీవితం అందరికి స్ఫూర్తి కలిగేలా రూపొందిస్తారట. ఇక ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్నో రకాల పాత్రల్లో కనిపించారు .. రాముడు, కృష్ణుడు ఇలా .. ఈ సినిమాలో బాలయ్య కూడా 62 గెటప్పులో కనిపిస్తాడట. దానికోసం మేకప్ మెన్ లను రంగంలోకి దింపుతున్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని రెండు గంటల్లో చూపించాలంటే అది కష్టం తో కూడుకున్న పని .. నిజంగా ఇదొక ప్రయోగమని చెప్పాలి. ఇక త్వరలోనే హీరోయిన్స్ మిగతా నటీనటులను ప్రకటించి వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. మరి ఎన్టీఆర్ గా అయన ఎలా అదరగొడతాడో చూడాలి.