లేటెస్ట్ న్యూస్ : తెలుగోడి కీర్తి నిలబెడతానన్న బాలయ్య

Wednesday, April 4th, 2018, 11:05:09 AM IST

బాలకృష్ణ, నందమూరి వంశంలో తన ఉనికిని చాటుకొని తనకుంటూ ఒక లెజందరీ యాక్టర్ గా పేరు తెచ్చుకొని, ఒక‌వైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటున్న బాల‌య్య మ‌రోవైపు ప‌లు ఉత్స‌వ వేడుక‌లని ఘ‌నంగా నిర్వ‌హిస్తూ అందులో తనవంతు పాలు పంచుకుంటున్నారు. ఇటీవ‌ల లేపాక్షి ఉత్స‌వాలని ఘ‌నంగా నిర్వ‌హించారు బాల‌య్య‌. తెలుగు సంస్కృతి, సంప్ర‌దాయాలు ప్ర‌తిబింబించేలా జ‌రిగిన‌ లేపాక్షి ఉత్స‌వంలో బాల‌య్య శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు, కృష్ణుడి వేష‌దార‌ణ‌లో క‌నిపించి తెలుగు అభిమానులను అల‌రించారు. ఇక ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జర‌గ‌నున్న తెలుగు అసోసియేష‌న్ ర‌జ‌తోత్స‌వ వేడుక‌కి ముఖ్య అతిధిగా వెళ్ళ‌నున్న బాల‌కృష్ణ మ‌న తెలుగు వాడిని, కీర్తిని ఖండాలు దాటించి సంబ‌రాలు అంబ‌రాన్నంటేలా చేద్దామ‌ని తన ట్విట్టర అకౌంటు నుండి ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు. ఏప్రిల్ 7న ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఇక ఇటీవ‌ల త‌న తండ్రి బ‌యోపిక్ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేసిన బాల‌య్య ఈ మూవీని మేలో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ బ‌యోపిక్‌లో బాల‌య్య 64 పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక తండ్రి బయోపిక్ బాలయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.