తమిళ హీరోల ముందు బాలయ్య తొడగొట్టాడయ్యో .. ?

Monday, October 16th, 2017, 09:56:27 AM IST

నందమూరి బాలకృష్ణకు ఉత్సాహం వచ్చిందంటే ఎవ్వరు ఆపలేరు .. ఆయనలో కొత్త జోష్ ఎగిసిపడుతుంది. దాన్ని చిన్న పిల్లలు ఎంజాయ్ చేసినట్టు బాలయ్య జోష్ ఉంటుంది. ఇక డైలాగ్ చెప్పాలన్న .. యాక్షన్ చేయాలన్న ఆయనతరువాతే ఎవరైనా. తాజాగా తమిళ హీరోల ముందు బాలయ్య తొడగొట్టాడు ? అదికూడా స్టేజి పై !! బాలయ్య తొడ గొట్టడం తో అక్కడున్న తమిళ హీరోలు మరింత జోష్ తో ఈలలు వేశారు .. ఇదంతా చెన్నై లో స్టంట్ మెన్ అసోసియేషన్ 50 వసంతాల వేడుక సందర్బంగా చెన్నై లో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళ హీరోలతో పాటు గెస్ట్ గా బాలకృష్ణ పాల్గొన్నాడు. స్టేజి పైనే బాలయ్య ఓ యాక్షన్ సెక్యూన్స్ కూడా చేసి దుమ్ము రేపాడు. ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ స్టంట్ మాస్టర్స్ వందో వేడుకలో కూడా తానూ తన కొడుకుతో కలిసి పాల్గొంటానని చెప్పాడు. మొత్తానికి బాలయ్య స్టేజి పై కొత్త ఉత్సహాన్ని ఇచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments