అబ్బో .. బాలయ్య న్యూ లుక్ అదిరిందయ్యా ?

Monday, April 9th, 2018, 02:14:30 PM IST

నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూసేందుకు సిద్ధం కండి !! ఎందుకంటే అయన హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఏకంగా డజనుకుపైగా గెటప్పుల్లో కనిపించనున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ సినిమా ఇటీవలే హైద్రాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సినిమా, రాజకీయ జీవితంకు సంబందించిన విషయాలతో ఈ సినిమా ఉండనుంది. ఆయన హీరోగా క్రేజ్ తెచ్చిన గెటప్స్ ఈ సినిమాలో కనిపిస్తాయట.

సరే ఈ విషయం పక్కన పెడితే తాజాగా బాలయ్య న్యూ లుక్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు బాలయ్యను రకరకాల గెటప్స్ లో చుసిన వాళ్ళు ఆయనను ఇలా చూడగానే షాక్ అవుతున్నారు .. ఎందుకో తెలుసా .. బాలయ్య మీసాలు తీసి కనిపించడం అందరికి షాక్ ఇచ్చింది మరి. తాజాగా అయన ఎన్ ఆర్ ఐ లకోసం ఆస్ట్రేలియా వెళ్లారు .. అక్కడ ఇలా కొత్త గెటప్ లో బాలయ్య కనిపించడంతో షాక్ అయ్యారు .. బహుశా ఇది ఎన్టీఆర్ సినిమా కోసమే అయ్యుంటుందని అనుకుంటున్నారు. అది విషయం మరి బాలయ్య న్యూ లుక్ పై మీరు ఓ లుక్కెయ్యండయ్యా !