ఎన్టీఆర్ కోసం రంగంలోకి బాలయ్య ?

Saturday, April 28th, 2018, 09:48:58 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి దృష్టి ఆకర్షిస్తున్న చిత్రం ఎన్టీఆర్. నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కే ఈ సినిమాకు సడన్ గా దర్శకుడు తేజ తప్పుకోవడంతో సంచలనం రేపింది. ఉన్నట్టుండి అయన ఎందుకు తప్పుకున్నాడన్న విషయం పక్కన పెడితే ఈ సినిమాను నెక్స్ట్ దర్శకత్వం వహించేది ఎవరా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రాఘవేంద్ర రావు, క్రిష్, వై వి ఎస్ చౌదరి లాంటి దర్శకుల పేర్లు వినిపించాయి .. కానీ ఈ సినిమాను తానె దర్శకత్వం వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు బాలయ్య. నిజానికి ఈ సినిమా ప్రారంభంలో తన దర్శకత్వంలోనే ఎన్టీఆర్ సినిమా చేయాలనీ ప్లాన్ చేసాడు. మధ్యలో దర్శకుడు తేజ ఎంట్రీ ఇచ్చాడు. అన్ని కార్యక్రమాలు జరిగి సినిమా కూడా మొదలయ్యాక తేజ తప్పుకున్నాడు. ఇక ఈ సినిమాను తానే తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మంచి అనుభవం ఉన్న డైరెక్షన్ టీమ్ ని పెట్టుకుని ఈ సినిమా చేస్తాడట. ఇప్పటికే ఈ సినిమాను నిర్మాతగా కూడా మారిన బాలయ్య అటు దర్శకత్వం కూడా చేస్తుండడం విశేషం. ఈ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ ను నిరూపించుకోవాలి ప్లాన్ చేస్తున్నాడు. చూద్దాం ఏమి జరుగుతుందో.

  •  
  •  
  •  
  •  

Comments