రిక్షావోడుగా మారిన బాలయ్య ?

Tuesday, October 9th, 2018, 10:19:48 AM IST

నందమూరి బాలకృష్ణ తాజాగా రిక్షావాడుగా మారాడు .. ప్రస్తుతం అయన రిక్షా తొక్కుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలయ్య రిక్షావోడుగా ఎందుకు మారాడు ? అన్న సందేహం కలుగుతుందా !! అక్కడికే వస్తున్నాం. ప్రస్తుతం బాలయ్య క్రిష్ దర్శకత్వంలో అన్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దివిసీమ ప్రాంతంలో జరుగుతుంది. 70 వ దశకంలో దివిసీమలో సంభవించిన పెను ఉప్పనలో చాలా మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి వరదల్లో సర్వస్వము కోల్పోయిన వాళ్ళకోసం .. అప్పటి క్రేజీ హీరోలు ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ లు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ప్రస్తుతం దానికి సంబందించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో బాలయ్య తో పాటు సుమంత్, రానా కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం దానికి సంబందించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ సందర్బంగా అక్కడ రిక్షా తొక్కాడు .. ప్రస్తుతం బాలయ్య తో ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సందర్బంగా తీసిన ఫోటో లీక్ అయింది. విద్యా బాలన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా జనవరిలో విడుదల చేస్తున్నారు.