బాలయ్య దర్శకుడి వార్ణింగ్ .. చిరంజీవికేనా?

Tuesday, December 27th, 2016, 10:55:49 PM IST

balayya
సంక్రాంతి పండగ అనగానే సినిమాలకు పెద్ద పండగ, ఈ పండగలో పెద్ద సినిమాలు, పెద్ద స్టార్స్ పోటీ పడడం సహజమే .. అలాగే ఇప్పుడొచ్చే సంక్రాంతికి కూడా భారీ పోటీ. అది కూడా ఇద్దరు పెద్ద హీరోల మధ్య నెలకొన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి ”ఖైదీ నంబర్ 150”, నందమూరి బాలయ్య ”గౌతమీపుత్ర శాతకర్ణి”. ఈ రెండు సినిమాలు ఆయా ఇద్దరు హీరోలకు ప్రతిష్టాత్మక సినిమాలే .. ఎందుకంటే చిరు 150 వ సినిమా, బాలయ్యది వందో సినిమా. ఈ రెండు సినిమాల్లో ఏది సంక్రాంతి బరిలో నిలబడుతుందో అనే ఉత్సాహం అప్పుడే అభిమానుల్లో మొదలైంది. ఇప్పటికే మా హీరో అంటే మా హీరో అంటూ బెట్టింగ్స్ కూడా వేసుకుంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే నిన్న తిరుపతిలో జరిగిన గౌతమీపుత్ర శాతకర్ణి పాటల వేడుకలో దర్శకుడు క్రిష్ .. మొదటి సారి కాస్త ఆవేశ పడ్డట్టు కనిపిస్తుంది? ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నాం .. ఖబడ్ధార్ ? అంటూ ఆడియో వేడుకపై తొడ కొట్టినంత పని చేసాడు? ఈ వార్నింగ్ ఎవరికీ ఇచ్చాడో స్పష్టంగా అర్థం అవుతుంది .. ఖచ్చితంగా అది ఖైదీ కె అని చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈ బరిలో బాలయ్యకు గట్టి పోటీ ఇచ్చేది చిరంజీవే కాబట్టి ? మరి క్రిష్ కావాలనే చిరంజీవికి వార్ణింగ్ ఇచ్చాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మెగా అభిమానులు కూడా ఈ విషయం పై కాస్త సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారు మరి?

  •  
  •  
  •  
  •  

Comments