రజిని రికార్డ్ ను బ్రేక్ చేసిన బాలయ్య !

Saturday, April 24th, 2021, 04:30:12 PM IST

సీనియర్ హీరోల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన రజినీ “కబాలి” టీజర్ 37 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను, బాలయ్య ‘అఖండ’ టీజర్ 38 మిలియన్ల వ్యూస్ తో బ్రేక్ చేసింది. మొత్తానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డ్ ను, బాలయ్య బ్రేక్ చేయడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బాలయ్య ఖాతాలో ఒక సరికొత్త రికార్డ్ అయితే చేరింది. ఈ ‘అఖండ’ టీజర్ తో అనూహ్యంగా ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.