గానకోకిల‌కు బాలు జాతీయ‌ పుర‌స్కారం

Tuesday, May 22nd, 2018, 04:34:31 PM IST

`ది నైటింగెల్ ఆఫ్ సౌత్` అని అభిమానులు స‌గ‌ర్వoగా పిలుచుకుంటారు సీనియ‌ర్‌ గాయ‌ని జానకిని. దాదాపు ఆరు ద‌శాబ్ధాలుగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డలో త‌న‌దైన గానాలాప‌న‌తో అల‌రించిన గాన కోకిల కెరీర్‌లో 50,000కు పైగా పాట‌లు పాడారు. ఉత్త‌మ గాయ‌నిగా నాలుగు సార్లు జాతీయ పుర‌స్కారం, 31 సార్లు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. జాన‌కికి తాజాగా బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం ద‌క్కింది. ప్ర‌తి ఏటా బాలు పుట్టిన రోజు సంద‌ర్భ ంగా వివిధ రంగాల‌కి చెందిన ప్ర‌ముఖుల‌కు ఈ పుర‌స్కారం అందిస్తున్నారు. ఈ ఏడాది సింగింగ్ కేట‌గిరీలో జాన‌కిని ఈ అవార్డున‌కు ఎంపిక చేశారు. “జాన‌క‌మ్మ ఆశీస్సుల‌తో ఇంత పెద్ద గాయ‌కుడిని అయిన నాకు ఆమెను స‌త్క‌రించుకునే అవ‌కాశం రావ‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాన‌“ని బాలు ఈ సంద‌ర్భ ంగా తెలిపారు.

అయితే మేటి గాయ‌ని జానకి ఇటీవ‌ల త‌న వృత్తిని విడిచిపెడుతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం అంద‌రికీ షాకిచ్చింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు త‌న పాట‌కు ఎప్ప‌టికీ ముగింపు ఉండ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నారు. పాట మూగ‌నోము పాటిస్తోంది అంటూ క‌ల‌త చెందుతున్నారు. అయితే జాన‌కి మ్యాడ‌మ్ తిరిగి గొంతు స‌వ‌రించుకోవాలంటే రెహ‌మాన్ లాంటి సంగీత‌ద‌ర్శ‌కుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు బ‌తిమాలాల్సి ఉంటుందేమో?

  •  
  •  
  •  
  •  

Comments