భారత్ ని పెల్చేయ్యాలని చూస్తున్న భారతీయుడు .. ఫుల్ ప్లాన్ రెడీ

Wednesday, November 30th, 2016, 12:09:10 PM IST

man-shado
అతను ఫక్తు భారతీయుడు, పంజాబ్ నివాసి ఉండేది మాత్రం అమెరికా లో. కానీ తన మాత్రు దేశం అయిన భారత్ ని నిలువునా చీల్చడం – నాశనం చెయ్యడమే అతని లక్ష్యం. పేలుళ్లు చేసి కుట్రలు జరపడం కోసం పన్నాగాలు పన్నుతున్నాడు అతను. అమెరిక లో శాశ్వత పౌరసత్వం కూడా పొందాడు. అమెరికాలో ఇలాంటి ఒక వ్యక్తిని న్యాయాస్థానం దోషిగా నిర్ధారించింది. వివ‌రాళ్లోకి వెళితే, బల్వీందర్‌ సింగ్‌ అనే పంజాబీ అమెరికాకు వెళ్లి అక్క‌డే స్థిరపడ్డాడు. అక్క‌డే ఉంటూ ఖలిస్తాన్‌ ఉగ్రవాదులతో క‌లిసి ప‌నిచేస్తున్నాడు. త‌న సొంత రాష్ట్రంలోనే పేలుళ్లు జ‌ర‌ప‌డం, ప‌లువురు భార‌త అధికారుల‌ను హ‌తమార్చ‌డం వంటి చ‌ర్య‌ల‌కు స్కెచ్ వేస్తున్నాడు. ఈ కుట్రలు సక్సెస్ఫుల్ గా చెయ్యడం కోసం కావాల్సిన పేలుడు సామాగ్రి దగ్గర నుంచీ బోలెడంత సామాన్లు ఇప్పటికే పంపిణీ కూడా చేసాడు. కొందరు ఉగ్రవాదులని భారత్ పంపించి అక్కడ వారితో ఫోనులో సంభాషిస్తున్నాడు. అత‌డిపై అనుమానం వ‌చ్చి నిఘా ఉంచిన అధికారులు 2013 డిసెంబర్‌లో అరెస్టు చేసి పూర్తి వివ‌రాలను సేక‌రించారు. చివ‌ర‌గా నిన్న న్యాయ‌స్థానం అత‌డిని నేరానికి పాల్పడినట్లు తేల్చింది. దీంతో అత‌డికి కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇండియాలో భారీ కుట్ర‌ల‌కు పాల్ప‌డ‌డానికి బల్వీందర్‌ సింగ్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నాడ‌ని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు.