సచివాలయం కూల్చే పైసలతో కరోనా ఆసుపత్రి కట్టొచ్చు

Saturday, July 11th, 2020, 02:00:40 AM IST


తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పాత సచివాలయం కూల్చివేత పై ప్రతి పక్ష పార్టీలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఒక్కొక్కరుగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని, ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు అని అన్నారు. నీటి ప్రాజెక్ట్ ల విషయం లో ఉపన్యాసాలు తప్ప ఏమి లేదని, ప్రజల దృష్టి మరల్చేందుకు సచివాలయం కులగొడుతున్నారు అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ సచివాలయం ను కూల్చే పైసలతో ఒక కరోనా ఆసుపత్రి కట్టవచ్చు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం గా అమాయక ప్రజలు కరోనా వైరస్ భారిన పడి మృతి చెందారు అని అన్నారు. అంతేకాక కాంగ్రెస్ పాలనలో కనీస వైద్య సదుపాయాలు లేవని, ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ లాక్ డౌన్ పెట్టీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు. అయితే ఇప్పటి వరకూ పార్టీ రాజకీయాల గురించి మాట్లాడని ఏకైక ప్రధాని మోడీ అని ప్రశంసలు కురిపించారు.