తెరాస లీకేజీల ప్రభుత్వం…బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Tuesday, June 30th, 2020, 06:40:35 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాస లీకేజీల ప్రభుత్వం అని ఘాటు విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిడ్ మానేరు, మల్లన్న సాగర్, అలానే నేడు కొండ పోచమ్మ కాలువకు గండి పడింది అని, ఇలా నాణ్యత లేని ప్రాజెక్టు ల కారణంగా అక్కడి పరిసర ప్రాంతాల్లో నీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇబ్బందులు పడుతున్నారు అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి జీవన విధానం చాలా కష్టాలతో సాగుతుంది అని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై ఘాటు విమర్శలు చేశారు. సీఎం ఉన్న సొంత నియోజక వర్గం లోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థతి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు.అయితే భారీ కుంభకోణాల కోసమే ఈ పథకాలు అని, అందుకు సాక్ష్యమే ఈ కొండ పోచమ్మ కాలువకు పడిన గండి అని బండి సంజయ్ విమర్శించారు.అయితే ఈ ప్రాజెక్టులకు లీకేజీల ప్రభుత్వం బాధ్యత వహించాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయం లో కాంట్రాక్టర్ లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వలన ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి అని బండి సంజయ్ వివరించారు. అంతేకాక ఈ కాంట్రాక్టర్లు కూడా ప్రభుత్వ పెద్దల బినామీలు కావడం ఈ లోపాలకు కారణం అని ఆరోపణలు చేశారు. అంతేకాక ఇలా నాణ్యత లేని ప్రాజెక్టు లను కట్టడాలు జరిపినందుకు వారి లైసెన్స్ లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు ఈ విషయం ద్వారా మరొకసారి ప్రజల తరపున గలమెత్తడం జరిగింది.