తెలంగాణ ప్రజలు కరోనా కి భయపడితే…కేసీఆర్ కి ఆ భయం పట్టుకుంది!

Sunday, July 12th, 2020, 11:25:53 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి కి భయపడితే, కేసీఆర్ కి బీజేపీ భయం పట్టుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఈ మేరకు బీజేపీ కార్యాలయం పై జరిగిన దాడి గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ కార్యాలయం పై దాడి ను ఖండిస్తూ, తమ పార్టీ నేతల పై, కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టినా, ఏనాడు రాజ్యాంగం ను అతిక్రమించ లేదు అని అన్నారు. కేసీఆర్, కవిత ల పై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు అని, తెరాస కి సిద్దాంతాలు లేవు అని, బీజేపీ సిద్దాంతాలు కలిగిన పార్టీ అని వ్యాఖ్యానించారు.అయితే తెరాస నేతలు పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారు అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల పై ఉంది అని తెలిపారు. అయితే కేంద్రం లో బీజేపీ దే అధికారం ఉంది అని, ఈ విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దు అని అన్నారు.

అయితే కేసీఆర్ అనుమతి కి బీజేపీ నేతకు ఎదురు చూస్తున్న విషయాన్ని వెల్లడించారు. అనుమతి ఇస్తే విషయాలు వివరించి, మంత్రులకు తెలుపుతాము అని, తెరాస నేతలు అవినీతి కి పాల్పడలేదు అని నిరూపించుకోవాల్సిన సమయం ఇదే అని అన్నారు. మరి ఈ వ్యాఖ్యల పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.