తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయి – బండి సంజయ్

Monday, June 7th, 2021, 06:12:21 PM IST


తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని ఇక కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లే సమయమ దగ్గరపడిందని అన్నారు. సీఎం కేసీఆర్ దగ్గర ఉన్నవాళ్లు అంతా ఉద్యమకారులో లేక ఉద్యమ ద్రోహులే కేసీఆరే చెప్పాలన్నారు. ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం కీలక పాత్ర పోశించిందని అన్నారు.

అయితే హుజూరాబాద్ నుంచి అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని అన్నారు. ఉద్యమంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల, నాయకుల పరిస్థితి ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పుడే పైసలాట ప్రారంభించారని అన్నారు. ఈటల విషయంలో కేసీఆర్ మరీ నీచంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.