బీజేపీ మతతత్వ పార్టీనే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Saturday, March 6th, 2021, 01:13:19 AM IST


తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా ములుగులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ 80 శాతం హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే తాము చేసేది ఏమీ లేదని, అలా అనుకుంటే బీజేపీ మతతత్వ పార్టీయే అని, తాను మతతత్వ వాదినేనని బండి సంజయ్ అన్నారు.

అయితే ఒక వర్గానికి కొమ్మకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దని బండి సంజయ్ సూచించారు. అసలు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అడిగారా అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడగని కేసీఆర్‌కు ఓటెందుకు వేయాలని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీ వీడుతారో ఎవరికి తెలియదని అన్నారు. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఎకరం భూమి కూడా ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు.