రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది.. బండి సంజయ్ కామెంట్స్..!

Tuesday, April 20th, 2021, 03:00:20 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే సీఎం కేసీఆర్ ఫామ్ లో సేద తీరుతున్నాడని, ఎన్నికలపై సమీక్షలు జరిపాడే తప్పా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏనాడు సమీక్ష జరపలేదని అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్, ఎమ్మార్పీ కంటే చాలా ఎక్కువ ధరలో కంపెనీలు అమ్ముతున్నాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. రెమ్డెసివర్ ఇంజెక్షన్ల కొరత ఉందని, ధర అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.

అయితే వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటుంటే, వ్యాక్సిన్ వేసుకోవాలని ఇప్పటిదాకా ఒక్క సారి కూడా సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పలేదని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్, వైద్య సిబ్బంది, మందుల విషయంలో ఉన్నత స్థాయి రివ్యూ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజలందరూ తప్పనిసరి కోవిడ్ నిబంధనలు పాటించాలని, అవసరమైతే తప్పా ఎవరూ బయటకు రావద్దని సూచించారు.