కక్ష సాధింపులకు ఉన్న సమయం కేసీఆర్‌కు ప్రజల ఆరోగ్యంపై లేదు – బండి సంజయ్

Tuesday, May 4th, 2021, 03:00:56 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని అన్నారు. కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్‌లు లేవని అనేక కాల్స్ వస్తున్నాయని, బంగారు తెలంగాణ కాస్త శవాల తెలంగాణగా మారిందని అన్నారు.

అయితే కక్ష సాధింపులకు సీఎం కేసీఆర్‌కు ఉన్న సమయం ప్రజల ఆరోగ్యంపై లేకపోవటం నిజంగా బాధాకరమని ఈటల అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖను తీసుకుని ఫాంహౌస్‌లో కూర్చుంటే సరిపోదని ఎద్దేవా చేశారు. కబ్జా భూములు వ్యవహారంపై నలుగురు ఈఆశ్ అధికారులతో కమిటీ వేశారని అదే నలుగురు ఐఏఎస్ అధికారులను కరోనా నియంత్రణ కోసం నియమిస్తే సంతోషించే వాళ్లమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్, ఆస్పత్రుల దోపిడీని అడ్డుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని, శ్మశానవాటికలో కెమెరాలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏంటో ప్రజలకు తెలుస్తాయని అన్నారు. కేసీఆర్ పని ఎంతసేపు సీఎం కుర్చీ కాపాడుకోవడం, ఆ కుర్చీని కొడుక్కి ఇవ్వాలనుకోవడం తప్పా వేరే ఆలొచన చేయడం లేదని బండి సంజయ్ అన్నారు.