చెప్పుడు మాటలను వినడం వల్లే ఎన్టీఆర్ కు నాకు విభేదాలు అంటున్న నిర్మాత

Saturday, January 28th, 2017, 11:00:35 PM IST

bandla-ganesh
తాను ఎవరితో సినిమా తీస్తే వాళ్ళను ఆకాశానికి ఎత్తేయడం స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు అలవాటే. కానీ ఆయన పవన్ కళ్యాణ్ కు నిజంగానే వీరాభిమాని. అలాగే ఒకప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా చాలా ఆయన మంచి సంబంధాలనే కలిగి ఉండేవారు. ఎన్టీఆర్ తో బండ్ల గణేష్ ‘టెంపర్’ సినిమా తీసే సమయంలో వారిద్దరికి విభేదాలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకు, ఎన్టీఆర్ కు మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయో చెప్పారు.

ఎన్టీఆర్ తో తాను రెండు సినిమాలు తీశానని.. మొదటి సినిమా ‘బాద్షా’ అని.. అయితే ఆ సినిమా వల్ల తనకు చాలా నష్టం వచ్చిందని, ఆ తరువాత ‘టెంపర్’ అనే సినిమా తీశానని, ఆ సినిమాతో తనకు బాగా లాభాలు వచ్చాయని బండ్ల గణేష్ చెప్పారు. ఎన్టీఆర్ తో విభేదాలు రావడంలో ఆయన తప్పేం లేదని, కేవలం చెప్పుడు మాటలు విని తానే ఎన్టీఆర్ ను తప్పుగా అర్ధం చేసుకున్నానని గణేష్ చెప్పారు. ఈ విషయంలో ఎన్టీఆర్ కు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. త్వరలోనే ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడుతానని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు.