బండ్ల బాబు భజనకు ..ఎన్టీఆర్ పడతాడా ?

Thursday, September 28th, 2017, 01:33:01 PM IST


నటుడిగా కెరీర్ మొదలు పెట్టి .. ఆ తరువాత బడా నిర్మాతగా అవతారం ఎత్తిన బండ్ల గణేష్ వ్యవహారం అప్పుడప్పుడు టాలీవుడ్ జనాలకు షాకిచ్చేలా ఉంటుంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న బండ్ల బాబు ఈ మధ్య ఒక్క సినిమా కూడా తీయడం లేదు. ఇప్పటికే ఆ సినిమా నిర్మిస్తా .. ఈ సినిమా నిర్మిస్తానంటూ మాటలైతే చెబుతున్నాడు. తాజాగా బండ్లబాబు .. ఎన్టీఆర్ జై లవకుశ సినిమాపై జోరు కామెంట్స్ చేసాడు. నిన్న రాత్రి జై లవకుశ సినిమా చూశానని, ఎన్టీఆర్ నటనకు ఆ రాత్రంతా నిద్దర పట్టలేదని చెబుతున్నాడు. రావణా పాత్రలో జీవించాడు అని, ఎన్టీఆర్ .. ఎస్ వి రంగారావు తరువాత ఆ స్థాయి నటన చూపించింది ఆయనే అని పెద్ద బిస్కెట్ వేసాడు. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టె బండ్ల గణేష్ ఎన్టీఆర్ గురించి ఇంతలా కామెంట్ చేయడం విశేషం? ఇదివరకే ఎన్టీఆర్ తో బాద్షా సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ఏవో తేడాలు వచ్చాయని వార్తలు వచ్చాయి .. ఆ తరువాత ఎన్టీఆర్ కు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ మళ్ళీ .. ఎన్టీఆర్ ని బుట్టలో వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక బండ్ల గణేష్ ఒక కాంగ్రెస్ నాయకుడికి బినామీగా ఉన్నాడని, అందుకే భారీగా సినిమాలు తీసాడని, ఇప్పుడు అయన అధికారంలో లేదు కాబట్టి బండ్ల గణేష్ సినిమాలు తీయడం లేదని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందన్నది చూడాలి ?

  •  
  •  
  •  
  •  

Comments