190 కోట్ల వ‌సూళ్లు.. అభిమాని సూటి ప్ర‌శ్న‌!

Sunday, May 6th, 2018, 01:00:11 PM IST

సీఎం భ‌ర‌త్ వ‌సూళ్లు అద‌ర‌హో! ఈ సినిమా కేవ‌లం రెండు వారాల్లోనే 190 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఇక 200 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టేందుకు ఇంకెంతో దూరంలో లేనేలేదు. ఆ క్ర‌మంలోనే డివివి సంస్థ అధికారికంగా 190 కోట్ల వ‌సూళ్ల పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది.

అయితే ఈ పోస్ట‌ర్ ఇలా వచ్చిందో లేదో యాంటీ ఫ్యాన్స్ ఓ రేంజులో చెల‌రేగిపోతున్నారు. ఒక అభిమాని అయితే .. ఈ లెక్క‌ల‌న్నీ త‌ప్పుల త‌డ‌క‌లు అని తిట్టి పారేశాడు. “బాగానే డిస్కౌంట్లు ఇస్తున్నారు స‌ర్‌.. 12 రోజుల‌కు 192 కోట్లు వ‌చ్చింది. 2 వారాల‌కు 190 కోట్ల పోస్ట‌ర్ వేశారు. ఏంటిది? ఇంకో పోస్ట‌ర్ వ‌ద‌లండి న్యాయంగా కొత్త‌ది..“ అని అడిగాడు ఫ్యాన్‌. అదంతా స‌రే.. ఇలా డివివి సంస్థ అధికారికంగా పోస్ట‌ర్ వ‌దిలింది కాబ‌ట్టి, ఆ మేర‌కు జీఎస్టీ క‌డుతున్నారా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. మ‌న సినిమాల‌కు 14 శాతం నుంచి 25 శాతం మ‌ధ్య జీఎస్టీ వ‌సూలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అంటే 190 కోట్ల వ‌సూళ్ల‌పై `భ‌ర‌త్ అనే నేను` చిత్రానికి జీఎస్టీ ఎంత చెల్లించాలి? అన్న‌ది లెక్క ఎవ‌రు తేలుస్తారు? పెద్ద సినిమాలకు 24 శాతం జీఎస్టీ చెల్లించాల‌నే రూల్ ఉన్న‌ట్టుండి?!