బ్యాంకు ఉద్యోగులే `పెద్ద నోటు` దొంగ‌లుగా..!?

Tuesday, November 15th, 2016, 10:07:57 PM IST

2000
బ్యాంకుల‌కు క‌న్నం వేసేందుకు దొంగ‌లే రానక్క‌ర్లేదు. బ్యాంకు ఉద్యోగులే ఆ ప‌ని చేస్తే..! ఇదిగో అలాంటి ఘ‌ట‌నే ఇది. ప్ర‌ధాని మోదీ 500, 1000 నోట్ల ర‌ద్దుతో ఉక్కుపాదం వేశాక ఎక్క‌డ చేప‌లు అక్క‌డ గిల‌గిలా కొట్టుకుపోతున్నాయ్‌. ప‌నిలో ప‌నిగా బ్యాంకు ఉద్యోగులు దీనికి బాధితులుగా ఉన్నారు. ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో కానీ.. బ్లాక్‌ని వైట్ చేయ‌బోయి ఓ ఇద్ద‌రు బ్యాంకు ఉద్యోగులు అడ్డంగా బుక్క‌యిపోయారు. ఈ ఘ‌ట‌న హౌఐద‌రాబాద్ స‌రూర్ న‌గ‌ర్‌లో జ‌రిగింది.

ఓ జాతీయ బ్యాంకులో క్యాషియర్‌ రాధిక, క్లర్క్‌ మల్లేశ్ అస‌లు ఎలాంటి ఐడీ ప్రూఫ్‌ లేకుండా రూ.6 లక్షల విలువైన పాత రూ.1000, 500 నోట్లను డిపాజిట్ చేసి తెల్ల నోట్ల‌ను తీసుకున్నారు. అయితే దీనిపై బ్యాంక్ మ్యానేజ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో గుట్టు ర‌ట్ట‌య్యింది. ఉద్ధేశ‌పూర్వ‌కంగానే వీళ్లు బ్యాంకుని మోసం చేసినందుకు చీటింగ్ కేసు న‌మోదు చేశారు. శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు అప్ల‌య్ చేయ‌నున్నారు. తెలిసిన వాళ్లింట్లో అర్జెంటుగా పెళ్లి ఉండ‌డంతో ఈ మార్పిడి య‌త్నం చేశామ‌ని క్యాషియర్ చెబుతున్నా పోలీసులు త‌మ‌దైన శైలిలో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. మొత్తానికి బ్యాంకులో ప‌నిచేస్తూనే బ్యాంకుకే టోక‌రా వేయాల‌ని చూశారు ఘ‌నాపాటీలు. అడ్డంగా దొరికిపోయారిలా.