ఒబామా-నెట్‌ఫ్లిక్స్ భారీ మూవీ డీల్‌

Wednesday, May 23rd, 2018, 10:46:39 AM IST

అమెరికా మాజీ అధ్య‌క్షుడిగా శ్వేత‌జాతీయుడు బ‌రాక్ ఒబామా ప్ర‌పంచానికి సుప‌రిచితం. పాల‌న‌లో స‌వ్య‌సాచిగా అత‌డికి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఘ‌డించిన ఆయ‌న ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్ విధానాల‌పై నిప్పులు చెరుగుతున్నారు. అదంతా అటుంచితే.. బ‌రాక్ ఒబామా సొంతంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప్రారంభించి సినిమాల నిర్మాణం వైపు అడుగులు వేయ‌డం అమెరికా స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

బ‌రాక్ ఒబామా, ఆయ‌న భార్య మిచెల్లీ ఒబామా క‌లిసి ప్ర‌ఖ్యాత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్ర‌కారం టీవీ, వెబ్ సిరీస్‌లు, ఫీచ‌ర్ సినిమాలు, డాక్యుమెంట‌రీలు, డాక్యు సిరీస్‌లు తెర‌కెక్కించ‌నున్నారు. ఇందుకోసం భారీగానే బ‌డ్జెట్ ని ఒబామా కేటాయించ‌నున్నార‌ట‌. రాజ‌కీయ నాయ‌కులు వినోద‌రంగంపై ఆక‌ర్షితులు కావ‌డం ఆస‌క్తి రేకెత్తించేదే అయినా ఒబామా స‌డెన్ డెసిష‌న్ ఏంటా? అంటూ ఒక‌టే ఆశ్చ‌ర్య‌పోతున్నారంతా. ఇక బుల్లితెర‌పై అప్పుడ‌ప్పుడు ఒబామా షోలు ఇదివ‌ర‌కూ ఆస‌క్తి రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments