కాళేశ్వరం అంటేనే పెద్ద అవినీతి – బట్టి విక్రమార్క

Monday, August 19th, 2019, 09:43:34 PM IST

తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చరిత్ర అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో ఆశతో, ప్రజలందరి సహకారంతో, ప్రజలకోసం ఆలోచన చేసి, తెలంగాణ తెరాస ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టును అనుకున్న సమాయానికి పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వ సత్తా ని నిరూపించుకుందని చెప్పాలి. రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టుకు నీటిని తీసుకొచ్చింది. కాగా ఇటీవలే ఈ ప్రాజెక్టును ఎంతో ఘనంగా ప్రారంభించారు కూడా. కాగా ఈ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కూడా హాజరయ్యారు.

అయితే గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రాజెక్ట్ కు వరద నీరు అధిక మొత్తం లో వచ్చి చేరుతున్నాయి. కాగా ఈ నీటితో ప్రాజెక్టు అంతా కూడా నిండిపోయిందని చెప్పాలి. ఈ ప్రాజెక్టు వలన దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా నీరు చాలా పుష్కలంగా చేరుతుందని చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో చాలా అవినీతి జరిగిందని ప్రస్తుతం చాలా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ ప్రాజెక్టుకు మొదట 28వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనతో ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రందాదాపు 80 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయినట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు ఈ విషయాన్నీ పట్టుకొని తెలంగాణ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం పై తీవ్రతరంగా విరుచుకుపడుతుంది. అయితే రివర్స్ పంపింగ్ పేరుతో ఎన్నో వేల కోట్ల రూపాయల వ్యయాన్ని పెంచారని కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క ఇప్పటికే పలు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ని తమ్మిడి హట్టి నుంచి నిర్మిస్తే ఇంత ఖర్చు అనవసరంగా అయుండేది కాదని, ఒకవేళ అలా నిర్మించే ఉంటే గ్రావిటీ ద్వారా నీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి వచ్చి ఉండేదని బట్టి విక్రమార్క ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్రస్థాయిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపేందుకు కేంద్రపై ఒత్తిడి తెస్తామని బట్టి విక్రమార్క హెచ్చరిస్తున్నారు.