జగన్ వాఖ్యలను స్వీకరిస్తామన్న భట్టి విక్రమార్క

Saturday, June 15th, 2019, 02:17:49 AM IST

తెలంగాణ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాఖ్యలను స్వీకరిస్తామని, తన మాటలు అన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేవిధంగా ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా పిరాయింపులను వ్యతిరేకిస్తున్న జగన్‌…కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి రాకపోవడమే శ్రేయస్కరమని బట్టి విక్రమార్క అన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మొదలు పెట్టిన చేవెళ్ల ప్రాజెక్టుని వ్యతిరేకించిన కెసిఆర్, ఇపుడు అధికారంలోకి వచ్చాక చేవెళ్ల ప్రాజెక్టుకి పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరు పెట్టారని మండిపడ్డారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరవుతే, రాజశేఖర్ రెడ్డి గారు చేసింది తప్పవు అని జగన్ ఒప్పుకున్నారు అవుతుందని బట్టి విక్రమార్క అన్నారు… పిరాయింపుల విషయంలో నిబద్దతతో ఉన్న జగన్‌, పిరాయింపు దారులతో ఎలా కలుస్తారని ప్రశ్నించారు.

అయితే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఇప్పటి వరకు రూ. 50వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని, మరో రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతము చెబుతున్నారని అన్నారు. నిజానికి ప్రాజెక్టు ప్రారంభ అంచనా వ్యయం రూ.38,000 వేల కోట్లు మాత్రమే ఉందని వివరించారు. రీ డిజైన్‌ పేరుతో ప్రాజెక్టు ఎస్టీమేషన్‌ లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. రూ. 28,000 వేల కోట్లతో 14 లక్షల ఎకరాల సాగునీరు అందించాల్సి ఉండగా, ఇప్పటికి రూ.50వేల కోట్లు ఖర్చు పెట్టి కూడా డబ్బులు పొలానికి నీరు పంపిస్తలేరని ఆయన ఆరోపించారు.