BB3 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

Sunday, January 31st, 2021, 07:02:47 PM IST

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. అభిమానులకు చిత్ర యూనిట్ పండుగ లాంటి న్యూస్ చెప్పేసింది. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం కి ఇంకా టైటిల్ కూడా వెల్లడించలేదు చిత్ర యూనిట్. B B 3 working టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించి ఒక ఫస్ట్ రోర్ మినహా ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అయితే కరోనా లాక్ డౌన్ అనంతరం తెలుగు సినీ పరిశ్రమ లో వరుస సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ వస్తుండటం కూడా అభిమానులను నిరాశ పరిచింది.

అయితే ఈ చిత్రం ను మే 28 న ఈ ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని నేడు చిత్ర యూనిట్ ప్రకటించడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్యను మాస్ లుక్ లో చూపించాలంటే బోయపాటి తర్వాతే అని చెప్పాలి.